ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంచి భోజనం అందించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ 

విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంచి భోజనం అందించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 26:

మంగళవారం గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ రోజు మధ్యాహ్నం విద్యార్థినులకు ఏర్పాటు చేసిన భోజనం ను ఆయన పరిశీలించారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని, ప్రతీ వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని తెలిపారు. విద్యార్థులు హ్యాండ్ వాష్ సరిగా చేస్తున్నారో లేదో పరిశీలించాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యెక అధికారి, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now