ఓడీఎఫ్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

IMG 20250414 162938
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఎద్దు మైలారం) అడ్మిన్ భవనం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.ఎస్. ప్రసాద్ పూలమాల వేశారు. అనంతరం ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం మరియు భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన అపూర్వమైన కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ విభాగాల సిబ్బంది, యూనియన్లు, అసోసియేషన్లు, వర్క్స్ కమిటీ, జేసీఎం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment