కన్కల్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 30
తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో శనివారం రోజున హనుమాన్ భజన కమిటీ, ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నదాతగా వ్యవహరించిన చాకలి కమలాకర్, భక్తులకు అన్నప్రసాదం, అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన భజన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకుల,సంతృప్తి వ్యక్తం చేశారు.
👉 భక్తి, సేవా భావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం గ్రామంలో ఆదర్శంగా నిలిచింది.