ప్రజా సమస్యల పరిష్కారంపై బీజేపీ డిమాండ్

ప్రజా సమస్యల పరిష్కారంపై బీజేపీ డిమాండ్

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 22

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, తాడ్వాయి మండల బీజేపీ అధ్యక్షుడు యెల్మ సంతోష్ రెడ్డి, ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) కు శుక్రవారం రోజున మెమొరాండం సమర్పించారు.

 

ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

 

కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు హోటల్ శ్రీను, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దత్తాత్రేయ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు స్వామి, మండల ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ధర్మపురి, మండల కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు నర్సారెడ్డి, డా.రవి, డా.రమేష్ నాయి, రమేష్, ప్రవీణ్, బూత్ అధ్యక్షులు కిషన్ రావు, రాజు, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

కార్యక్రమం ముగింపులో కార్యకర్తలు “భారత్ మాతాకీ జై” నినాదాలతో ఊరిని మార్మోగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment