శివ్వంపేట తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): శివ్వంపేట మండలంలోని పలు సమస్యలపై మండల ఉప తహసీల్దార్ కు బీజేపీ శివ్వంపేట మండల అధ్యక్షుడు పెద్దపులి రవి ఆధ్వర్యంలో మెదక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ సమక్షంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వాళ్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. శివ్వంపేట పట్టణంలోని చెరువు కట్ట మీదుగా పిల్లుట్ల, అల్లీపూర్, రత్నాపూర్, తాళ్లపల్లి తండా, కొత్తాపేట్ గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అక్కడ బీటీ రోడ్డును వేసి ఆ సమస్యను పరిష్కరించాలని అన్నారు. మెదక్ జిల్లాలోని ఎక్కడ లేని విధంగా శివ్వంపేట మండలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల మండలంలోని పలు గ్రామాలలో ప్రధాన రహదారులు, ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అయిపోయాయని, ఈ అతి భారీ వర్షాలకు మండలంలోని రైతుల పంటలు మునిగి చాలా నష్టపోవడం జరిగిందని వారికి తగిన నష్టపరిహారాన్ని అందజేయాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేద ప్రజలకే మంజూరు చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సుపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని మండల ఉప తహశీల్దార్ మహమ్మద్ షఫీయోద్దీన్ కు వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండల్ రావు, జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి, అశోక్ సాదుల, మాజీ సర్పంచ్ గోప్యా నాయక్, మండల ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు రామ్ రెడ్డి, రాజు, సీనియర్ నాయకులు నర్సారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యువమోర్చా అధ్యక్షులు భాస్కర్, మండల నాయకులు శ్రీనివాస్ గౌడ్, విఠల్ నాయక్, నర్సింలు, సుధాకర్, షాదుల్ల, మహేష్, బాల మల్లేష్, సికిందర్, భాస్కర్, రాంసింగ్ నాయక్, భిక్షపతి, రత్నాకర్, శివ శంకర్, అశోక్, రాజు, రవి కళ్యాణ్, చెన్నయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment