వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: సీజీఆర్ ట్రస్ట్‌ చైర్మన్‌ చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, జనవరి 01 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సీజీఆర్ ట్రస్ట్‌ చైర్మన్‌, బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 12న జరగనున్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని సీజీఆర్ క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్‌ సభ్యులతో చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి సమావేశం అమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, వివేకానంద ఆశయాలను ప్రతిష్ఠించేందుకు జనవరి 10, 11, 12 తేదీలలో గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. అనంతరం ఆయన ఆ పాఠశాల క్రీడామైదానాన్ని స్వయంగా పరిశీలించారు. క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఏ.కృష్ణ, పీఈటీ, కబడ్డీ కోచ్‌ అమ్మగారి విష్ణువర్ధన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, యాదిరెడ్డి, సత్యనారాయణ, సూర్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌, పి.శ్రీనివాస్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌, కరుణాకర్‌గౌడ్‌, చంద్రారెడ్డి, జయపాల్‌రెడ్డి, నర్సింలు, సత్యం ముదిరాజ్‌, సాయిగౌడ్‌, సాయి యాదవ్‌, బాబు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment