యావత్ భారతాన్ని ఏకం చేసిన వందేమాతరం: జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): యావత్ భారత జాతిని ఏకం చేసి, భారతీయులందరిలో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించిన గీతం “వందేమాతరం” అని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం చారిత్రాత్మక ప్రాధాన్యం సంతరించుకుందని, అది భారతీయులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య సమరానికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒకేసారి నిర్వహించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ఓ పద్మజరాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment