బాల్యవివాహాన్ని అడ్డుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు

బాల్యవివాహాన్ని అడ్డుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో శుక్రవారం బాల్య వివాహం జరుగుతుందని 1098 కు సమాచారం రావడంతో వారు స్థానిక చైల్డ్ వెల్ఫేర్ అధికారులను అప్రమత్తం చేయగా అధికారులు వివాహ స్థలానికి చేరుకుని వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించినట్లు స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కాసుల స్వరూప అశోక్ ల కుమార్తె మానస ( ప్రవలిక ) ను బిబిపేట మండలం యాడారం గ్రామానికి చెందిన ఎదునూరి బాల్ లక్ష్మి నారాయణ ల కుమారుడు ప్రవీణ్ తో వివాహం జరిగే స్థలానికి అధికారులు వచ్చి వయసు నిర్ధారణ చేయగా బాలిక మైనర్ అని తేలడంతో వివాహాన్ని నిలిపివేసినట్లు గ్రామస్తుల తెలిపారు. అనంతరం ఇరు కుటుంబాల సభ్యులను పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం, కామారెడ్డి పట్టణంలోని సఖి కేంద్రానికి తరలించినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్, ఎంపీడీవో, ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment