మెదక్/నార్సింగి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): కృష్ణాష్టమి సందర్భంగా శనివారం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పాఠశాలలకు సెలవులు కావడంతో చిన్నారులు తమ ఇళ్లలోనే కృష్ణుడి, గోపికల వేషధారణలో అలరించారు. తల్లులు ప్రత్యేకంగా పిల్లలను సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. వీరిని చూసి పెద్దలు, తల్లిదండ్రులు ఆనంద పడి చిన్నారుల ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సంబర పడ్డారు. ఆలయాల్లోనూ భక్తజనం అధిక సంఖ్యలో పూజలు చేశారు.