Site icon PRASHNA AYUDHAM

రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధికి కలెక్టర్ పిలుపు

IMG 20251113 164614

రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధికి కలెక్టర్ పిలుపు

కామారెడ్డిలో FPOల వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 13 

కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్‌లో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) వ్యాపార వైవిధ్యీకరణ మరియు సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ (ICM), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కేంద్ర పథకాలైన FPOలు, CSCలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ICM డైరెక్టర్ గణేశన్, NCDC రీజినల్ డైరెక్టర్ సర్దూల్, జిల్లా సహకార అధికారులు, PACS అధ్యక్షులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Exit mobile version