భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిజామాబాద్ రైల్వే ఆల్ ఇండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి పొలం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో పలువురు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎం. మల్లికార్జున్ (బ్రాంచ్ ప్రెసిడెంట్), కే. గంగరాజు (డివిజనల్ సెక్రటరీ), డిచ్పల్లి రైల్వే స్టేషన్ మేనేజర్, లింబాద్ రాథోడ్ (ట్రెజరర్), ఎం. శంకరయ్య (అడ్వైజర్) తదితరులు పాల్గొన్నారు.
ప్రీతం, సుధాకర్, ప్రభు, సాయినాథ్, నీలాబాయి, అమిత్ బగేలా వంటి ఎగ్జిక్యూటివ్ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.












