నిర్భయంగా వార్తలు అందించేందుకు పేరుగాంచిన ప్రముఖ న్యూస్ రిపోర్టర్ ఐలేని రాజుకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (Ivf) ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. సమాజ సేవలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన కృషికి గుర్తింపుగా ఈ సత్కారం లభించింది.
కామారెడ్డిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సేవాదళ్ చైర్మన్ డాక్టర్ బాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలేని రాజు చేస్తున్న సామాజిక కృషిని, ఆయన నిర్భయ జర్నలిజాన్ని ప్రశంసిస్తూ, ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ, సామాన్యుడి గొంతుకగా నిలుస్తున్న ఐలేని రాజు వంటి విలేకరులు నేటి సమాజానికి ఎంతో అవసరం. ఆయన పత్రికా వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధత అభినందనీయం" అని అన్నారు. ఈ సన్మానం ఆయన నిర్భయ జర్నలిజానికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు.
తన సేవలను గుర్తించి సన్మానించినందుకు ఐలేని రాజు IVF బృందానికి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి మరిన్ని కథనాలతో ముందుకు సాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తన గమ్యంలో సహకరిస్తున్న ప్రతి విలేకరి మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.












