కామారెడ్డి, 20-07-2026
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ పథకం కింద కామారెడ్డి జిల్లాలో యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో (మై భారత్), మేరా యువ భారత్ కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం మరియు గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘాల నిర్మాణం కోసం యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తు ఆహ్వానించడం అయినది.
ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మేరా యువ భారత్ అధికారి బి. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లడం, ప్రతి గ్రామంలో యువజన సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం, యువతను సామాజిక సేవ వైపు తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
వయసు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, కామారెడ్డి జిల్లాకు చెందినవారై ఉండాలి. సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
ఆసక్తిగల అభ్యర్థులు మై భారత్ అధికారిక పోర్టల్ https://mybharat.gov.in/pages/ny_corps_gjt కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ దరఖాస్తును సమర్పించాలి. ఈ దరఖాస్తుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రతి మండలానికి ఇద్దరు యువ వాలంటీర్లు అవసరం. ఎంపికైన అభ్యర్థులకు రెండు సంవత్సరాల కాలం పాటు నెలకు 5000 రూపాయలు గౌరవ వేతనం అందజేయబడుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. శిక్షణ మరియు సర్టిఫికెట్ కూడా అందజేయబడుతుంది.
మరిన్ని వివరాలకు మేరా యువభారత్ నిజామాబాద్ కార్యాలయం ఫోన్ నెంబర్ 7780338076 ను సంప్రదించవచ్చు.












