నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ డివిజన్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకలకు నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ నాయకులు రవీందర్ రెడ్డి, అన్నం రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, సమాజంలో అసమానతలను తొలగించి, అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కాలనీ అసోసియేషన్లు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాన హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ఆదర్శప్రాయమని వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాగరాజు, గౌస్ సార్, కృష్ణ చారి, వామన్, నిమ్మల శీను తదితర నాయకులతో పాటు పలు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











