కామారెడ్డి జిల్లా 40వ వార్డులో శనివారం నిర్వహించిన వార్డు సభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ఈ సభలో కలెక్టర్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వార్డు సభలు వేదికలుగా ఉంటాయని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం ద్వారా పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేయాలని కలెక్టర్ సూచించారు.
జల్ సంచయ్ – జల్ భాగీధారి కార్యక్రమం కింద, వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్పారు.







