జగిత్యాల పట్టణంలో ఓ కల్లు దుకాణంలో నాలుగేళ్ల బాలుడు కల్లు తాగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. కొత్త బస్టాండ్ సమీపంలోని షాప్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మైనర్లకు మద్యం లేదా మత్తు పానీయాలు అమ్మకూడదనే ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఈ సంఘటన పూర్తిగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, దుకాణాల వద్ద నిఘా పెంచాలని కోరుతున్నారు. బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.







