కామారెడ్డి పట్టణంలోని శిథిలావస్థకు చేరుకున్న స్మశాన వాటికల పునరుద్ధరణకు సమగ్ర కార్యాచరణ అవసరమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం సదర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.
స్మశాన వాటికలను సమాజానికి అత్యవసరమైన మౌలిక సదుపాయాలుగా పరిగణించాలని, వాటి అభివృద్ధికి కుల, పార్టీ భేదాలకు అతీతంగా అందరూ కలిసిరావాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని వైకుంఠ దామాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై శిథిల స్థితిలో ఉన్నాయని, వాటి పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వ్యాపారవేత్త తిమ్మయ్య కుటుంబానికి చెందిన సుభాష్ను ఆయన అభినందించారు. సమాజ సేవలో భాగంగా స్మశాన వాటికల అభివృద్ధికి ఆయన తీసుకున్న చొరవను ప్రశంసించారు. సదర్ సంఘం సభ్యులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో వివిధ కుల సంఘాల అధ్యక్షులు, ప్రముఖులు పాల్గొన్నారు. సంఘ ప్రతినిధులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.












