మైనర్ బాలికపై POCSO చట్టం కింద నమోదైన కేసులో, బాధిత బాలిక వివరాలు, ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లిదండ్రుల సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది.
POCSO చట్టం కింద నమోదైన FIR No. 684/2026 లో బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లిదండ్రుల వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయంపై FIR No. 706/2026, Juvenile Justice Act, BNS మరియు POCSO చట్టాల కింద కేసు నమోదు చేయబడింది.
ఈ విధమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఖాతాల ఐడీలు మరియు సంబంధిత URLలను గుర్తించి, ఆయా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు పంపించబడినట్లు సమాచారం.
బాధితురాలైన బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లిదండ్రుల సమాచారాన్ని ప్రచురించిన సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి.
ప్రజలకు మరియు సోషల్ మీడియా నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తూ, POCSO కేసుల్లో బాధితుల వ్యక్తిగత వివరాలు లేదా తల్లిదండ్రుల వివరాలు బహిర్గతం చేయడం వల్ల తీవ్రమైన మానసిక వేదన కలుగుతుందని, ఇది చట్ట ఉల్లంఘన అని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు తెలిపారు.












