నిజామాబాద్, 2026-07-17
నకిలీ పత్రాలు సృష్టించి ఖాళీగా ఉన్న ఇంటిని ఇతరుల పేరుపై నమోదు చేయించిన ఐదుగురు సభ్యుల ముఠాను నిజామాబాద్ మూడో టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు మరిన్ని వివరాలు వెల్లడించారు.
నకిలీ పత్రాలు సృష్టించి ఖాళీగా ఉన్న ఇంటిని ఇతరుల పేరుపై నమోదు చేయించిన ఐదుగురు సభ్యుల ముఠాను మూడో టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ భర్త గతంలో మృతిచెందాడు. ఆయన పేరిట అదే కాలనీలో 50 గజాల స్థలంలో ఇల్లు ఉంది. భర్త మరణించిన తర్వాత ఆమె బంధువుల వద్ద నివసిస్తూ ఉండటంతో ఆ ఇల్లు ఖాళీగా ఉంది.
దీనిని ఆసరాగా చేసుకున్న ఇర్ఫాన్, సలీం, శివకుమార్, పోశెట్టి, శ్రీనివాస్ అనే ఐదుగురు వ్యక్తులు రిజిస్ట్రేషన్ రైటర్ సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించి, ఆ ఇంటిని ఇతరుల పేరుపై మార్చించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు మూడో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుల పాత్ర నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.










