కామారెడ్డి, జూలై 15
కామారికవరీెడ్డ జల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కేంద్రికవరీ ప్రికవరీభుత్వ సీఈఐఆరికవరీ్ (CEIR) పోరికవరీ్టల్ ద్వారికవరీా సులభంగా తరికవరీగ పొందే అవకాశం ఉందన జల్లా ఎస్పీ ఎం. రికవరీాజేష్ చంద్రికవరీ తెలపారికవరీు. మొబైల్ ఫోన్ల భద్రికవరీత అత్యంత ముఖ్యమన, బాధతులకు న్యాయం అందంచేందుకు ప్రికవరీత్యేక సాంకేతక బృందం పనచేస్తోందన ఆయన చెప్పారికవరీు.
కామారెడ్డి జిల్లాలో మొబైల్ ఫోన్ పోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సులభంగా తిరిగి పొందే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, కీలక డేటా ఉండటంతో వాటి భద్రత అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఇన్స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి నెల సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితులకు అందజేస్తోందని చెప్పారు.
ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో గత 30 రోజుల్లోనే రూ.21.76 లక్షల విలువైన 136 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.27 కోట్ల విలువైన 794 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. గత ఏడాది రూ.3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేసినట్లు వివరించారు.
సీఈఐఆర్ పోర్టల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలో మొత్తం 5,075 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ.8.12 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు విజయవంతంగా అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. మొబైల్ రికవరీలో విశేష ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సిమ్ కార్డును బ్లాక్ చేయాలని, అనంతరం CEIR పోర్టల్‌లో IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలని ప్రజలకు సూచించారు. సైబర్ మోసాల బారిన పడకుండా అనుమానాస్పద కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రికవరీ అయిన మొబైల్ ఫోన్లను పొందేందుకు బాధితులు అవసరమైన ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎస్ఐ బాలరాజును సంప్రదించాలని ఎస్పీ సూచించారు.












