నిజామాబాద్, జూలై 14
నిజామాబాద్ ఎస్హెచ్ఓ పరిధిలోని బబన్సా పహాడ్ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసి, వారి నుంచి బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ ఎస్హెచ్ఓ పరిధిలోని బబన్సా పహాడ్ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం మంగళవారం నిర్వహించిన దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా ఒకరిని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.
నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి న్యాయ ప్రక్రియ నిమిత్తం అసలు కేసు పత్రాలు, స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, అలాగే నిందితుడిని నిజామాబాద్ స్టేషన్ హౌస్ అధికారికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో సీఐ రాంకుమార్, ఎస్ఐ రాజన్నతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు భూమన్న, విశ్వనాథ్, సాయి, లక్ష్మీనర్సింహ, మౌనిక, శివ, సంకీర్త్, విట్టల్, అర్పిత, మౌనిక, శ్యామ్, కానిస్టేబుల్ బాలకిషన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. అరెస్టు చేసిన నిందితుడు సౌద్ చౌస్, బబన్సా పహాడ్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు వెల్లడించారు.












