ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తు చేసి, బాధితులకు అండగా నిలవండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తు చేసి, బాధితులకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్, ఎబ్.బి.డబ్ల్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్ లో వేగం పెంచాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఇన్వెస్టిగేషన్లో సందేహాలు ఉంటే, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఎస్.హెచ్.ఓలు తమ ఏరియాలో గల ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రాంతాలలో గల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామలపై పూర్తి అవగాహన కలిగి, ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ ల కదళికలై నిఘా ఉంచాలన్నారు. బ్లూకోల్ట్స్ మరియు నైట్ పెట్రోలింగ్ సిబ్బంది “పాపిలోన్ డివైస్” లను వినియోగిస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించాలని అన్నారు. విమెన్ సేఫ్టీ, రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ఆయా ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. అనంతరం యస్.హెచ్.ఓ వాహనాలను తనిఖీ చేస్తూ.. ప్రతి వాహనాన్ని రెగ్యులర్ సర్వీసింగ్ చేయిస్తూ, ఎలాంటి రిపేర్స్ లేకుండా పూర్తి కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవరులకు సూచించారు. ముఖ్యంగా డ్రైవర్స్ వాహనాలను ఎట్టి పరిస్థితులలోనూ రాంగ్ రూట్లో నడపరాదని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు.ఎస్పీ సిహెచ్. రఘునందన్ రావు, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావు, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, ఆర్.ఐలు రామా రావు, రాజశేఖర్, జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment