సంగారెడ్డి, జూలై 15
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆదర్శ సహకారంతో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, కళాశాలలో ఆర్ఓ వాటర్ సదుపాయాన్ని కల్పించేందుకు లయన్స్ క్లబ్ హామీ ఇచ్చింది.
సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో, సంగారెడ్డి జిల్లా లయన్స్ క్లబ్ ఆదర్శ సహకారంతో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రవీణ మాట్లాడుతూ, విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉన్నత స్థాయిలో రాణించగలరని అన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సంగారెడ్డి జిల్లా లయన్స్ క్లబ్ ఆదర్శ అధ్యక్షుడు లయన్ విజయేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ రీజినల్ కార్యదర్శి లయన్ వెంకటేశంలు మాట్లాడుతూ, ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు లేకుండా విజయం సాధించడం కష్టమని, విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
తారా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్యకు పరిష్కారంగా ఆర్ఓ వాటర్ సదుపాయాన్ని కల్పిస్తానని లయన్ విజయేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గత నెలలో పదవీ విరమణ పొందిన డాక్టర్ జగదీశ్వర్ ను లయన్స్ క్లబ్ ఆదర్శ సంగారెడ్డి బృందం శాలువాతో సన్మానించింది.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆదర్శ డిస్టిక్ చైర్మన్ లయన్ రామప్ప, లయన్ ప్రకాష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిర్మల, రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ జోత్స్న, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.












