ఝరాసంగం, జూలై 8
ఝరాసంగం మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినుల కోసం బేటీ బచావో – బేటీ పడావో (BBBP) కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె.లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ బచావో – బేటీ పడావో (BBBP) కార్యక్రమంలో భాగంగా ఝరాసంగం మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె.లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.
బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, పోష్ (POSH) చట్టం, పోక్సో (POCSO) చట్టం, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆడపిల్లల ప్రాముఖ్యత, విద్య అవసరం, మహిళల భద్రత, సాధికారత వంటి పలు కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ, డీసీపీవో, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త, మెడికల్ ఆఫీసర్, సఖి సెంటర్ ప్రతినిధులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పోలీసు శాఖ సిబ్బంది, జెండర్ స్పెషలిస్ట్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












