సంగారెడ్డి, జూలై 23
సంగారెడ్డిలోని ఆదర్శ జిమాక్స్ కాలనీ పార్కులో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కలు జరిగింది. విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఔషధ, పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటారు. ఇప్పటికే రెండు వేల మొక్కలు పెంచుతున్నామని, ఖాళీ స్థలాల్లో మరిన్ని నాటుతున్నామని ఆయన తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆదర్శ జిమాక్స్ కాలనీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను నాటారు. కాలనీలో ఇదివరకే సుమారు రెండు వేల మొక్కలను పెంచి సంరక్షించామని, అదనంగా ఖాళీ స్థలంలో మరిన్ని మొక్కలు నాటుతున్నామని డి.అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు యేసయ్య, కాలనీ బాలబాలికలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.












