తాడ్వాయి మండలంలో 6,142 ఎకరాల్లో పంట నష్టం అంచనా
కామారెడ్డి జిల్లా తాడ్వాయి (ప్రశ్న ఆయుధం)ఆగస్టు 29:
తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. గ్రామాల వారీగా AEOల, ద్వారా వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం మొత్తం 6,142 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేశారు.
ఇందులో వరి – 1,640 ఎకరాలు, మొక్కజొన్న – 2,867 ఎకరాలు, పత్తి – 1,042 ఎకరాలు, సోయాబీన్ – 573 ఎకరాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఎండ్రియాల్ గ్రామంలో పంట నష్టాన్ని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, సహాయ వ్యవసాయ అధికారి ఎల్లారెడ్డి సుధామధురి, మండల వ్యవసాయ అధికారి నర్సింలు, AEO శివ చైతన్య, అశోక్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు.
వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలలో గణనీయమైన నష్టం జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు రైతులకు, భరోసా ఇచ్చారు.