కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం విజయవంతం* *డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు,సూపర్డెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి

డిప్యూటీ
Headlines
  1. జమ్మికుంటలో కుటుంబ నియంత్రణ శిబిరం ఘన విజయం
  2. కోట, కుట్టులేని (ఎన్ ఎస్ వి) ఆపరేషన్లు: వైద్యుల సేవలకు ప్రశంసలు
  3. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం
  4. డాక్టర్ చందు, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి సేవలతో శస్త్ర చికిత్సలు విజయవంతం
  5. ఆరోగ్య శాఖ ఉత్తర్వులతో వావిలాల, ఇల్లందకుంట పరిధిలో శస్త్ర చికిత్సలు
*జమ్మికుంట డిసెంబర్ 5 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ ఉత్తర్వుల మేరకు గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు, సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వావిలాల ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ఏఎన్ఎం లు ఆశాల ద్వారా వచ్చిన అర్హులైన 25 మంది మగవారికి కోత,కుట్టులేని (ఎన్ ఎస్ వి) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్ల అనంతరం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి వారికి వివరంగా చెప్పారు ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్డెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం కుమార్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్,హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూపర్వైజర్ సదానందం ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now