*నలుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్*
*సెల్ ఫోన్ లు, బైక్లు 9400 నగదు స్వాధీనం*
*ఎస్ఐ డి వెంకటేశ్వర్లు*
ప్రశ్న ఆయుధం ,వేములపల్లి డిసెంబర్ 29:
వేములపల్లి గ్రామ శివారులోని చిన్న చెరువు వద్ద వేములపల్లి, మిర్యాలగూడ సంబంధించిన 6 మంది వ్యక్తులు అందరు బహార్ పేకాట ఆడుచుండగా వచ్చిన సమాచారం మేరకు వేములపల్లి ఎస్సై సిబ్బంది తో కలిసి వారిపై దాడి చేయగా అందులో నలుగురు వ్యక్తులు పట్టుబడినారు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినారు. అట్టి నేర స్థలం నందు రూ.9400 నగదు, 4 సెల్ ఫోన్లు, 4 మోటారు సైకిల్ మరియు 104 పేక ముక్కలు వారి నుంచి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయనైనది ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు.