గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవాలయానికి పాదయాత్రగా చేరుకున్న కాట దంపతులు

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ వారి నివాసం నుండి రుద్రారంలోని శ్రీ గణేష్ (గణేష్ గడ్డ) దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ రుద్రారం గ్రామంలోని రామాలయం వద్ద పాదయాత్రతో చేరుకొని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రుద్రారం శ్రీ గణేష్ దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్ళారు. ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment