ఫూడ్ పాయిజన్ ఘటనల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదు
– కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం
– ఎస్ ఎఫ్ ఐ, పి డి ఎస్ యు, ఏఐఎస్ఎఫ్
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఫుడ్ పాయిజన్ ఘటనల పై ప్రభుత్వ పాఠశాలనూ శనివారం బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుధవారం కుమార్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు జి సురేష్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు శివ, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలలో కల్తీ ఆహారంతో, ఫుడ్ పాయిజన్ల సంఘటనలు, పాము కాటుతో, విద్యార్థుల మరణం, మధ్యాహ్న భోజనం పథకంలో కారం మెతుకులతో, చాలీచాలని భోజనాలతో ప్రభుత్వం విద్యా రంగన్ని నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా పర్యవేక్షణలు చేయడం, విద్య శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి ఫుడ్ పాయిజన్ల ఘటనపైన సమీక్ష నిర్వహించి దీర్ఘకాలిక కమిటీ వేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడలన్నారు. మధ్యాహ్న భోజనం సంబంధించిన నిధులను పెంచి, నాణ్యత కలిగిన భోజనాలను అన్ని ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల కేజీబీవీలలో, సంక్షేమ హాస్టల్స్ ల లో అనేక ఘాటనలు జరుగుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. వెంటనే విద్య రంగ సమస్యలు పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరుగుతుందని హేచ్చరించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు బందు విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు మణికంఠ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సంపత్, పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణ, జిల్లా నాయకులు సతీష్, శ్రీరామ్, శ్రీకాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.