సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ఐక్యత మార్చ్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని “మై భారత్” సంస్థ సమన్వయంతో ఐబి నుండి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర చేపట్టారు. ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందేమాతరం ‘జైహింద్’ నినాదాలతో నగరం మార్మోగింది. తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వందేమాతరం గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో పాటు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 100వ సంవత్సరం 2047 వరకు భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీక.. ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని అన్నారు. స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతదేశ 536 సంస్థానాలతో చిన్న చిన్న ముక్కలుగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఉండి ప్రత్యేక రాజ్యాలుగా ఉండేదని ఆ సంస్థానాలన్నిటిని భారతదేశంలో విలీనం చేసిన మహనీయుడు అఖండ భారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమైనప్పటికీ మన హైదరాబాద్ సంస్థానంతో పాటు కాశ్మీర్ భారతదేశంలో విలీనం కాలేదని తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం ఆపరేషన్ పోలో నిర్వహించి 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో హైదరాబాద్ సంస్థనాన్ని విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుందన్నారు. సంస్థానాల విలీనం ద్వారా అఖండ భారతావని నిర్మించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుందని అన్నారు. భారతదేశాన్ని ఐక్యంగా, శక్తివంతంగా నిలబెట్టడం మనందరి బాధ్యత అని అన్నారు. దేశ సమైక్యత వెనుక పటేల్ లాంటి మహనీయుల త్యాగాలు ఉన్నాయని, ఆయన స్ఫూర్తిని ఆచరణలో పెట్టి యువత దేశ సేవలో ముందుండాలని ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ దేశ ఏకతకు, సామాజిక సమగ్రతకు చేసిన కృషి అపూర్వం.. ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకం అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, జాతీయ సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ, ప్రభుత్వ అధికారులు ఆయన స్ఫూర్తిని తమ కర్తవ్యాల్లో ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు. 1947లో దేశాన్ని ఏకం చేసిన సర్దార్ పటేల్ స్ఫూర్తిని ప్రతి భారత పౌరుడు, ఆయన చూపిన మార్గం నేటి తరానికి మార్గదర్శకమని, అధికారులు ప్రజల్లో దేశభక్తి, ఐక్యతా భావాన్ని నింపేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తిని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏక్ బారత్ ఆత్మనిర్బార్ భారత్ పేరట ఈ యూనిటీ మార్చి కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. దేశ సమగ్రత కోసం భావితరాలకు స్వతంత్ర సంగ్రామంలో మహనీయులు చేసిన కృషిని తెలియజెప్పడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దూకదం చేస్తాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వం” భారతదేశ బలమని, మన అందరం ఈ దేశానికి వరమని గుర్తిస్తూ సమైక్యతతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎం.రంజిత్ రెడ్డి, జిల్లా యువజన అధికారి, మై భారత్, మోయస్, గోల్. జిల్లా యువజన అధికారి ఖాసీం బేగ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలోట్రైనీ కలెక్టర్లు దీపికా, ప్రతిభ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో ఘనంగా ఐక్యత మార్చ్
Oplus_16908288