సంగారెడ్డి, జూలై 27
జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, లక్ష్యాల సాధన, సేవల నాణ్యత, రికార్డుల నిర్వహణపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.కె.లలితాదేవి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆమె ఆదేశించారు.
జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, లక్ష్యాల సాధన, సేవల నాణ్యత, పెండింగ్ అంశాలు, రికార్డుల నిర్వహణ, నివేదికల సమర్పణ తదితర అంశాలపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.కె.లలితా దేవి ఆధ్వర్యంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ కార్యక్రమాల (Programme) అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా డా.లలితా దేవి మాట్లాడుతూ, ప్రతి కార్యక్రమ అధికారి తమ పరిధిలోని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని, ఆరోగ్య సూచికలను మెరుగు పరిచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
అలాగే, ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన డా. నాగనిర్మల, డా. శశాంక దేశపాండే, డాక్టర్ లక్ష్మి శైలజ, డా.ప్రవీణ్ కుమార్, డా.మనోహర్ రెడ్డి, డా. దీప్తి, డా. శశి కిరణ్, అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












