కామారెడ్డి, 2026-07-09
కామారెడ్డిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించి 120 యూనిట్ల రక్తాన్ని సేకరించిన వాసవి క్లబ్ బీబీపేట్ కు 'తలసేమియా లైఫ్ సేవర్ అవార్డు 2026' దక్కింది. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అమ్మద్ లు ఈ పురస్కారాన్ని అందజేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 120 యూనిట్ల రక్తాన్ని సేకరించిన వాసవి క్లబ్ బీబీపేట్ కు 'తలసేమియా లైఫ్ సేవర్ అవార్డు 2026' లభించింది. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అమ్మద్ లు ఈ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, జమీల్ అహ్మద్ లు మాట్లాడుతూ, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2025 సంవత్సరంలో 120 యూనిట్ల రక్తాన్ని సేకరించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాసవి క్లబ్ లలో మొదటి స్థానంలో నిలిచిన వాసవి క్లబ్ బీబీపేట్ ను అభినందించారు. తలసేమియా బాధితులైన చిన్నారులకు ప్రతి 15 రోజులకు జీవితాంతం రక్తం అవసరమని, అలాంటి వారి ప్రాణాలను కాపాడటం కోసం ముందుకు వచ్చిన క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి సంవత్సరం చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా, అందుకు వాసవి క్లబ్ సానుకూలంగా స్పందించి, శిబిరాలు నిర్వహిస్తామని తెలియజేసింది. ఇప్పటివరకు తలసేమియా బాధిత చిన్నారుల కోసం 6000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం జరిగిందని వారు తెలిపారు. రక్తదాన శిబిరాల నిర్వహణకు యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పర్ష వెంకటరమణ, వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి శ్రీనివాస్, వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్, జోనె చైర్మన్ తడుపునూరి నాగభూషణం, విశ్వ మోహన్, నంగునూరి చంద్ర శేఖర్, బచ్చు రామచందం, నీల బైరయ్య, రెడ్డి శెట్టి వెంకటేశం, పెద్ది నాగయ్య, ఇల్లందులో ఆంజనేయులు, తొడుపునూరి శ్రీనివాస్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.












