కామారెడ్డి, నిన్న రాత్రి
గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన నందు (22) అనే యువకుడు పాము కాటుకు గురై, సకాలంలో అందిన వైద్యంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నాటు వైద్యం తర్వాత పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి, వైద్యం అందించిన 108 సిబ్బందిని, వైద్యులను అభినందించారు.
గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన నందు (22) అనే యువకుడికి విషాదం చోటుచేసుకుంది. గాంధారిలో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లిన నందు, వాష్‌రూమ్‌కు వెళ్లే క్రమంలో పాము కాటుకు గురయ్యాడు. పాము కాటు వేసిన వెంటనే, అతన్ని పేట్ సంగం గ్రామంలోని సంగమేశ్వర ఆలయం వద్దకు నాటు వైద్యం కోసం తీసుకెళ్లారు.
నాటు వైద్యం తర్వాత పరిస్థితి విషమించడంతో, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడ ఉన్న పంతులుగారు నాటు వైద్యం అందించి, తదుపరి చికిత్స కోసం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం, బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గాంధారి 108 అంబులెన్స్ సిబ్బంది రమేష్ (EMT) వెంటనే పేట్ సంగం సంగమేశ్వర గుడి వద్దకు చేరుకుని, నందును అంబులెన్స్‌లోకి తీసుకున్నారు.
108 కాల్ సెంటర్లోని డాక్టర్ సలహా మేరకు వైద్యం అందించి, ఏరియా ఆసుపత్రి బాన్సువాడకు తరలించారు. అక్కడ వైద్యులు శ్రీను నాయక్ సార్ గారు చికిత్స అందించారు. అతి త్వరగా ఆసుపత్రికి తీసుకువచ్చినందుకు డాక్టర్ శ్రీను నాయక్ సార్, EMT రమేష్, పైలట్ నరేష్‌లను అభినందించారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది.












