సంగారెడ్డి ప్రతినిధి, మర్చి 13 (ప్రశ్న ఆయుధం, న్యూస్): సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గ ప్రజలకు సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతి మాత ప్రజలందరినీ చల్లగా చూడాలని చింతా ప్రభాకర్ కోరారు.
హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Published On: March 13, 2025 7:12 pm
