సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈనెల 11న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరగనున్న ధర్మదీక్ష కార్యక్రమంలో బీసీ సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈనెల 11న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఈ ధర్మదీక్ష బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి నాంది అవుతుందని తెలిపారు. బీసీ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులందరూ ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ శ్రీధర్, మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల్ కృష్ణ, మీడియా ప్రతినిధి మహేష్ కుమార్, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్, కో-కన్వీనర్లు చంద్రయ్య, స్వామి, సుధాకర్ గౌడ్, గౌలిశ్వర్, రవీందర్, కుమ్మరి గోపాల్, మంజులగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో ఈనెల 11న బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం ధర్మదీక్ష: బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్
Published On: November 8, 2025 9:05 pm