కల్తీకల్లు బాధితులను పరామర్శించిన పోచారం

కల్తీకల్లు బాధితులను పరామర్శించిన పోచారం

ప్రశ్న ఆయుధం 08 ఏప్రిల్ ( బాన్సువాడ  ప్రతినిధి)

బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సందర్శించారు.నసురుల్లాబాద్ మండలంలోని పలువురు కల్తీ కల్లు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో వారిని పరామర్శించి,ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు సుమారు 69 మంది కల్తీకల్లు సేవించి ఆసుపత్రికి చేరగా పలువురిని నిజామాబాద్, కామారెడ్డి ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సూపరిండెంట్ విజయలక్ష్మి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment