రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాట శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశ మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వారి నివాసంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన స్మృతిని స్మరించుకున్నారు. అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆధునిక భారతానికి పునాది వేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని, ఐటీ, టెలికాం విప్లవానికి దారి తీశారన్నారు. ఆయన కలలను నెరవేర్చడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment