కౌలంపేట గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

సంగారెడ్డి, డిసెంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండలం కౌలంపేట గ్రామ సర్పంచ్‌గా కుమ్మరి స్వాతి శ్రీశైలం, ఉప సర్పంచ్‌గా వీరమణిలను పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే వార్డు సభ్యులుగా ఖుర్షిదా బేగం, శ్రీనివాస్, పల్లవి, మహ్మద్ ఫారుక్, దశరథ్, శ్రీనాథ్, మహ్మద్ బాబాలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment