Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదంలో స్పాట్లో మృతి

IMG 20250706 WA0631

రోడ్డు ప్రమాదంలో స్పాట్లో మృతి

షాద్ నగర్ రాఘవేంద్ర ఐటీఐ కాలేజ్ సమీపంలో విషాదం

షాద్నగర్ శివారులోని కొత్తపేట రహదారిలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాఘవేంద్ర ఐటీఐ కాలేజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో డీసెం టైర్ల కింద పడినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో యువకుడు తల భాగానికి తీవ్ర గాయాలవడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు ప్రత్యక్షదారులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు . మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఎన్ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. రద్దీ సమయంలో వేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version