*కొత్తపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కొడంగల్ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి*
ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుముల తిరుపతి రెడ్డి అన్నారు.గురువారం రోజు కొత్తపల్లి మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు..పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఓ వరం అని అన్నారు.కొత్తపల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మీ పథకం,మరియు ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయకుమార్,పిఎసిఎస్ చైర్మన్ నర్సిములు,మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి,తిరుపతి రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,మహేందర్ రెడ్డి,రమేష్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సి.చంద్రప్ప,అధికారులు పాల్గొన్నారు…..