సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బలోపేతంపై సమావేశం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా నూతన డీసీసీ నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ సెక్రటరీ ఎస్.జరితను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిన్న ముదిరాజ్ కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మండల మరియు జిల్లా స్థాయి కమిటీల పునర్వవస్థీకరణ, రాబోయే ఎన్నికల వ్యూహంపై సవివరంగా చర్చించారు. పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లే దిశగా మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మావిన్ గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అరుణ్ గౌడ్, ఐఎన్టియుసీ అధ్యక్షుడు కోల్కూరీ నరసింహారెడ్డి, సదాశివపేట మాజీ కౌన్సిలర్ అరుణ్, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment