సంగారెడ్డి, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పర్యాద రామకృష్ణా రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్లు నాయికోటి రామప్ప, అనంతరావు కులకర్ణి సౌజన్యంతో ఈ కార్యక్రమాలు మూడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొంగళూరులో ప్రధానోపాధ్యాయుడు సంగప్ప, పసల్వాదిలో ప్రధానోపాధ్యాయుడు వహీద్, మామిడిపల్లిలో కే. సిద్ది రాములు నేతృత్వంలో మెంటల్ వెల్నెస్ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ, చెడు అలవాట్ల దూరీకరణపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుకునే క్రమంలో మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండడం ద్వారా మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని అన్నారు. యువత సెల్ఫోన్లకు బానిసలవకుండా, చదువులో దృష్టి సారించి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి.శాంతికుమార్, జి.రమేష్, వై.రాజేశ్వర్రావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెంటల్ వెల్నెస్ అవగాహన కార్యక్రమాలు
Published On: October 11, 2025 7:48 pm