విద్యా సంస్థల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: రాష్ట్ర వైద్యానికి శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): అందోల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో జరుగుతున్న నిర్మాణం పనులు, అభివృద్ధి పనులపై అందోల్ పాలిటెక్నిక్ కళాశాలలో విస్తృత స్థాయిలో మంత్రి సమీక్ష జరిపారు. అందోల్ నియోజకవర్గంలోని విద్యా సంస్థల అభివృద్ధి, మౌలిక వసతులు మెరుగుపరచాలని సూచించారు. నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థల పరిస్థితులను సమీక్షించి, అవసరమైన వసతుల కల్పనపై ప్రిన్సిపాల్‌లు, అధికారులతో మంత్రి చర్చించారు. *విద్యారంగ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత*

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి, పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు పునాదిగా నిలుస్తాయని, అందుకే ప్రతి విద్యాసంస్థలో అవసరమైన సౌకర్యాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పుల్కల్, అందోల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అందోల్ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, శివ్వంపేట పాలిటెక్నిక్, సంగుపేటలో వ్యవసాయ పాలిటెక్నిక్ వంటి సంస్థల ప్రస్తుత పరిస్థితులు చర్చకు వచ్చాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా అడిగి తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఆక్సాన్ పల్లి, పోతుల బొగడ, బస్వాపూర్‌లోని మోడల్ స్కూళ్లు, అలాగే సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అందోల్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, సింగూర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్‌లలోని సౌకర్యాల పరిస్థితులపై కూడా విస్తృత చర్చ జరిగింది. విద్యార్థులకు వసతి, ఆహారం, క్రీడా సదుపాయాల నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా సూచనలు జారీ చేశారు. *బుదేరా మహిళా డిగ్రీ & పీజీ కళాశాలను మోడల్ తీర్చిదిద్దాలి.* 

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, బుదేరా విద్యాసంస్థ ప్రాధాన్యం పై మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఈ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, హాస్టల్లో వసతి సదుపాయాల పెంపు, డార్మెటరీ సౌకర్యాలు, డైనింగ్ హాల్ విస్తరణ, నూతన కిచెన్ పరికరాలు, ల్యాబ్ సామగ్రి వంటి అవసరాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈటిఎస్ ఈడబ్ల్యూ ఐడిసి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బిఈఈ రవి కుమార్ , రెవిన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment