పాపన్న విగ్రహ ఆవిష్కరణకు మంత్రి, టీజీఐఐసీ చైర్మన్ లకు ఆహ్వానం

IMG 20250817 071017
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో గౌడ సంఘం నాయకులు మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిలను కలిసి ఈనెల 18న సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్, మాజీ జడ్పిటిసి మల్లాగౌడ్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు కృష్ణగౌడ్, వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment