సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశానికి రైతులే వెన్నెముకలు నేడు రైతుల దయనీయ పరిస్థితుల పట్ల ప్రభుత్వం తగు విధంగా స్పందించవలెనని, మీరందరు రైతుబిడ్డలని రైతుల అభివృద్ధిలో మనమందరం పాలుపంచుకోవాలని ముఖ్య అతిథి, డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ మంగళపర్తి వెంకటేశం అన్నారు. భారత మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ జన్మదినంను పురస్కరించుకొని జాతీయ కిసాన్ దినోత్సవం సందర్భముగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీరంగూడలో లయన్స్ క్లబ్ ఆప్ హైదరాబాద్ అమీన్ పూర్ ఆధ్వర్యములో బి.క్రిష్ణాగౌడ్, కే.నాగరాజు సౌజన్యముతో దేశాభివృద్ధిలో రైతుల పాత్ర అనే అంశముపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ కూర నాగరాజు అధ్యక్షతన జరిగిన రైతుల దినోత్సవంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ.. వ్యసాయంలో రైతులు అనుభవిస్తున్న సమస్యలను విద్యార్థులకు వివరించారు. జోన్ చైర్మన్ బి.క్రిష్ణాగౌడ్, పి.సురేందర్ లు స్వర్గీయ చరణ్ సింగ్ గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కూర నాగరాజు, జోన్ చైర్మన్ బుల్కాపురం క్రిష్ణాగౌడ్, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మంగళపర్తి వెంకటేశం, జి.యస్.టి. చైర్మన్ పట్నం సురేందర్, లయన్స్ సి.రాజేందర్ కుమార్, జి.లింగం, కే.మహేందర్ రెడ్డి, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, తిరుపతి రావు, శంకరయ్య, పద్మజ్యోతి, వరలక్ష్మి, స్రవంతి, పి.డి. అమూల్య,సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆప్ అమీన్ పూర్ ఆధ్వర్యంలో జాతీయ కిసాన్ దినోత్సవం
Published On: December 23, 2025 9:59 pm