సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): పదేండ్లు నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తూ జనహితమే అభిమతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి కృషి మరువలేనిదన్నారు. అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సంక్షేమం అభివృద్ధి కొరకు ప్రజా పాలన కొనసాగిస్తూన్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులచే నిర్లక్ష్యం చేయబడ్డ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నాడని కొనియాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి పర్యయ పదంగా పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కారుకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుందన్నారు. ముఖ్యంగా బడుగులకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో స్థానిక ఎన్నికల్లో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్ కేటాయిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ కు టిక్కెటివ్వడంలో అణగారిన వర్గాల పట్ల రేవంత్ చూపిస్తున్న శ్రద్ధను అర్థంచేసుకోవచ్చని వివరించారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చి తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రజా పాలన: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు
Published On: November 8, 2025 8:45 pm