హైదరాబాద్ మహానగరంలోని కవాడిగూడ, దోమలగూడ బండా నగర్ ప్రాంతాలలో అప్సా స్వచ్ఛంద సంస్థ, ఆద్య హాస్పిటల్, రాహుల్ ఐ ఫౌండేషన్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి. ఈ శిబిరం ద్వారా పలువురు ప్రజలు ఉచిత వైద్య సేవలు పొందారు.
ఆద్య హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ భవాని, మహిళలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేద మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆమె అన్నారు.
రాహుల్ ఐ ఫౌండేషన్ కంటి వైద్యురాలు నవ్య, కంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. కంటి శుక్లాలు ఉన్నవారికి ఉచిత ఆపరేషన్లు చేస్తామని, కళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అప్సా స్వచ్ఛంద సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్, పేదల ఆరోగ్యం కోసం బస్తీలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో 200 మందికి పైగా ప్రజలు వైద్య సేవలు పొందారు.







