బాల్కొండ, 29 July
బాల్కొండ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు అతి పెద్ద హారన్లను ఉపయోగించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ శబ్దాలతో ప్రజలు, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
బాల్కొండ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో సాధారణ హారన్లకు బదులుగా భారీ వాహనాలకు వాడే పెద్ద హారన్లు అమర్చడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ హారన్లను ప్రతి సెకనుకు ఒకసారి మోగిస్తుండటంతో వచ్చే భారీ శబ్దాలకు ప్రజలు, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి శబ్దాలతో ప్రాణాపాయం కూడా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని బస్సుల డ్రైవర్లకు పలుమార్లు చెప్పినా వారు వినిపించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. బస్సులకు పరిమితికి మించిన హారన్లు ఉన్నందున వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలు కాలనీలవాసులు కోరుతున్నారు.












