బోరబండ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నెలకొన్న అసాంఘిక కార్యకలాపాలు, చెత్త సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో టిపిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్ రంగంలోకి దిగారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చలు జరిపారు.
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా బోరబండ శివయ్య బస్తీలో పర్యటించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చెత్త వేయడంపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. వెంటనే రైల్వే, మున్సిపల్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు.
ఈ సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ, సెక్యూరిటీ, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, చెత్త డంపింగ్‌ను తరలించాలని సూచించారు.
రైల్వే జీఎం శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించి, అధికారులను ఆదేశించినట్లు బండి రమేష్ తెలిపారు. గతంలో నడిచే ఆర్టీసీ బస్సులను తిరిగి స్టేషన్ వరకు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
ఈ చర్యలు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని బండి రమేష్ అన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.











